హైదరాబాద్: తన రాజకీయ పార్టీ జనసేనను విడుదల చేస్తూ చేసిన ప్రసంగంలో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన హావభావాలు గబ్బర్ సింగ్ సినిమాను
తలపించాయి. కుళ్లిన రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తూ, పిచ్చి వేషాలు వేసే నేతల
తాట తీయడానికే జనసేనకు ప్రాణం పోశానంటూ ఆయన భావోద్వేగాలతో కూడిన ప్రసంగం
చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, ఆయన
కూతురు కల్వకుంట్ల కవిత, ఆయన కుమారుడు కెటి రామారావుపై వ్యంగ్యాస్త్రాలు
విసిరారు. కెసిఆర్‌పై వ్యాఖ్యలు చేసే సమయంలో తెలంగాణ భాషలో మాట్లాడడానికి
ప్రయత్నించారు. తెలంగాణ ఇవ్వడంలో న్యాయం ఉందంటూనే రాష్ట్ర విభజన తీరుతో
సీమాంధ్రులను అవమానించారని, తెలుగు ప్రజలను విడదీసి వెన్నుపోటు పొడిచిందని
కాంగ్రెస్‌పై తీవ్ర పదజాలంతో......................More
Just another free Blogger theme
0 comments:
Post a Comment