హైదరాబాద్ : శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై శర్వానంద్, నిత్యామీనన్
జంటగా నిర్మిస్తున్న చిత్రం ‘ఏమిటో ఈ మాయ'. ప్రముఖ తమిళ దర్శకుడు చేరన్
డైరక్ట్ చేసిన ఈ చిత్రానికి స్రవంతి రవికిషోర్ నిర్మాత. ఈ చిత్రం
ప్రస్తుతం సెన్సార్ లో సమస్యలు ఎదుర్కొంటోందని ఫిల్మ్ నగర్ సమాచారం. చిత్రం
డబ్బింగ్ చిత్రంగా పరిగణించి సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తాననటంతో నిర్మాత
షాక్ అయినట్లు తెలుస్తోంది. తాము ద్వి భాషా చిత్రం గా దీని షూటింగ్ పూర్తి
చేసామని నిర్మాతలు ఖండిస్తున్నారు. అయితే రీజనల్ ఆఫీసర్ స్ట్రైయిట్ చిత్రం
అని నిరూపించటానికి తగ్గ రుజువులు అడగటం జరిగిందని తెలుస్తోంది. డబ్బింగ్
సినిమాగా చిత్రాన్ని సెన్సార్ చేస్తే టాక్స్ విషయంలో సమస్యలు వస్తాయి.
నిర్మాత మాట్లాడుతూ ''పిల్లలపై తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు.
తాము కన్న కలల్ని సాకారం చేయాలని ఆశిస్తుంటారు. అయితే ఈ విషయంలో యువత ఏం
చేస్తోందనేదే ఈ చిత్ర ప్రధానాంశం. నేటి తరం ప్రేమ వ్యవహారాల్లో కొత్త
కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు చేరన్. మనసుని హత్తుకునేలా
భావోద్వేగాలుంటాయి. అంతే స్థాయిలో వినోదమూ ఉంటుంది. ఈ సినిమా యువతనే
కాకుండా అందరినీ ఆకట్టుకొంటుంది. శర్వానంద్, నిత్యమీనన్‌ల ...........................More
Just another free Blogger theme
0 comments:
Post a Comment